PRATHIDWANI పన్ను చెల్లించకపోతే ప్రభుత్వ భవనం కట్టేస్తాం - రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్
🎬 Watch Now: Feature Video
పన్ను చెల్లిస్తారా... ప్రభుత్వ భవనం కట్టాలా. ప్రజల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఫ్లెక్సీ ఇది. పట్టణ స్థానిక సంస్థలు చేసిన ఈ హెచ్చరికతో పెద్ద కలకలమే రేగుతోంది. వీఎల్‌టీ బకాయిల వసూళ్లలో భాగంగా అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం ప్రజల్లో భయాందోళనలకు కారణం అయింది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ తీరు గురించి తెలుసుకున్న ప్రతిఒక్కరూ విస్తు పోతున్నారు. అసలు వేకెంట్ ల్యాండ్ టాక్సే మోయలేని భారంగా దేవుడో అనుకుంటూ ఉంటే... ఆ పేరు చెప్పి ఉన్న భూమి లాక్కుంటామంటే ఎలా అని తీవ్ర విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. అసలు వీఎల్‌టీ పేరిట రాజమహేంద్రవరంలో ఏం జరుగుతోంది. అధికారుల తీరుపై పౌరసమాజం, న్యాయనిపుణులు ఏమంటున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST