Prathidwani: అంతుచిక్కని ప్రశ్నగా కోడికత్తి కేసు - ఈటీవీ ప్రతిధ్వని ప్రోగ్రామ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2023/640-480-19104981-53-19104981-1690384065961.jpg)
Prathidwani: కోడికత్తి డ్రామాకు క్లైమాక్స్ ఎప్పుడు? కొంతకాలంగా రాష్ట్రంలో ఇదో అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. రాష్ట్ర పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ కూడా కోడికత్తి ఘటనపై విచారణ జరిపారు. ఎన్‌ఐఏ అంటే దేశంలో ఉగ్రవాద కేసులు, అత్యంత ప్రాధాన్యం ఉన్న కేసుల్ని దర్యాప్తు చేసే ప్రతిష్టాత్మక సంస్థ. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ కూడా ఎప్పుడో ఇందులో ఎలాంటి కుట్ర లేదంది. జగన్‌పై ఆరోజు విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి చేసింది.. వైసీపీ అభిమాని అని విచారణలో తేలింది. అప్పుడే వైసీపీ ప్రచారం కోసం, సానుభూతి కోసం నడిపించిన డ్రామా బట్టబయలైంది. అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం చేసినట్లు.. తెలుగుదేశానికి ఈ ఘటనతో సంబంధమే లేదని తేలింది. అయినా.. ఇంకా లోతుగా దర్యాప్తు.. మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ మెలికలు పెడుతునే ఉన్నారు. నిందితుడిగా ఉన్న దళిత యువకుడు.. శ్రీనివాస్‌కు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటునే ఉంటారు. ఏళ్లుగా జైల్లోనే నిందితుడు శ్రీనివాస్ మగ్గిపోతున్నాడు. దీంతో అత్యంత దయనీయంగా శ్రీనివాస్ కుటుంబసభ్యుల పరిస్థితి ఉంది. నా ఎస్సీలు, నా ఎస్టీలు అని పదేపదే చెప్పే ముఖ్యమంత్రికి.. శ్రీనివాస్ నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతుంటే బాధగా అనిపించడం లేదా? దర్యాప్తు ముగిశాక కూడా ఇంకా దర్యాప్తు పొడిగించాలని.. పదేపదే కోరడం శ్రీనివాస్‌కు అన్యాయం చేయడం కాదా? అసలు ఈ కథ కంచికి చేరేదెప్పుడు? ఇందులో అసలు వాస్తవాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.