PRATHIDWANI కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఎందుకింత జాప్యం - కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ పాదయాత్ర
🎬 Watch Now: Feature Video
కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఇప్పుడు... కడప ఉక్కు ఏది దిక్కు అన్న చందంగా మారింది. సాక్షాత్ సీఎం సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శిలాఫలకం వేసి మూడేళ్లు అవుతున్నా... ఒక్క అడుగు కూడా ముందుకు కదలని స్థితి. పైగా విభజన చట్టంలో హామీగా వచ్చిన కీలకమైన ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడతామని కూడా ఘనంగా ప్రకటించింది. అంతేనా... కడప జిల్లా బిడ్డగా అది నా బాధ్యత అని ప్రకటించారు సీఎం జగన్మోహన్‌రెడ్డి. మరి పరిశ్రమ నిర్మాణంలో మాత్రం ఎందుకింత జాప్యం. దాని సాధన కోసం విపక్షాలు పాదయాత్ర చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST