Prathidwani: ఈ నాలుగున్నరేళ్ల పాలనలో.. ఉత్తరాంధ్రకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేసింది?
🎬 Watch Now: Feature Video
Prathidwani: రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి విశాఖ పైనే. ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిరంతరం.. దగ్గరగా ఉండి సమీక్షించటం కోసమే జగన్ వైజాగ్‌కి మకాం మారుస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనిని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారా అసలు నమ్ముతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు అని వైసీపీ చెబుతోంది. మరి సీఎం వెళ్లి ఉత్తరాంధ్రలో కూర్చుంటే, యంత్రాంగం మొత్తాన్ని తనతో తీసుకుని వెళితే అది రాయలసీమ ప్రజలకు అసౌకర్యం కాదా? కోర్టు తీర్పులను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూస్తే మీకు ఏం అనిపిస్తోంది? విశాఖలోని రుషికొండపై ముఖ్యమంత్రి ఒక విలాసవంతమైన భవనం నిర్మించుకుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా? ఈ ప్రాంతంలో అభివృద్ధికి, మనుగడకు కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నుంచి విశాఖ ఉక్కు వరకు ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేసింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.