తవ్వే కొద్దీ తప్పులే - ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల సంఘం చర్యలు ఏవి? - ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 10:35 PM IST

Prathidwani: వెతికే కొద్దీ తప్పులే తప్పులు.. ఎక్కడ చూసినా అక్రమాల గుట్టలు. ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియకు ఆయువుపట్టు లాంటి ఓటర్ల జాబితాలకు సంబంధించి రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ అక్రమాల పర్వమిది. మరోవైపు యథేచ్ఛగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై విపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు ఎంతోకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేసింది సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతతను అధికార వైసీపీ ఎలా భ్రష్టు పట్టిస్తుందో కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో సవివరంగా పేర్కొంది ఈ సంస్థ. ఈసీ సన్నద్ధత, పారదర్శకతపై ప్రజలకు నమ్మకం కలిగించడానికి తక్షణ చర్యలు అవసరమని నిర్వచన్ సదన్ తలుపు తట్టింది సీఎఫ్​డీ (Citizens For Democracy). రాష్ట్రంలో అధికార వైసీపీ వాళ్లు తమ ఓట్లు తొలగిస్తున్నారని అనేకమంది ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడో 1, 2 ప్రాంతాల్లో కాదు. రాష్ట్రమంతటా జనం బయటకొచ్చి ఆధారాలు బయటపెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర కూడా బయటపడింది. మరి ఇంత తీవ్రమైన అంశంపై ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు? జగన్ సర్కారు ఉల్లంఘనలపై ఈసీకి చలనం ఏదా? రాష్ట్ర ప్రజల ముందున్న కర్తవ్యం ఏంటి? ఇదీ నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.