వైఎస్‌ కుటుంబాన్ని కడుపులో పెట్టుకున్న కడప జిల్లాకు జగన్ చేసిందేమిటి ? - kadapa

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 10:35 PM IST

Prathidwani Debate: కడప జిల్లా వైఎస్‌ కుటుంబాన్ని కడుపులో పెట్టుకుంది. తల్లి, తండ్రి, తనయుడు, చిన్నాన్న, చిన్నాన్న కుమారుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబానికి మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి వరకూ అన్ని ఇచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఎడుగూరి సందింటి కుటుంబాన్ని దశాబ్దాలుగా ఎదలో పెట్టుకుంది. మరి ఆ కుటుంబం కడప జిల్లాకు ఏం చేసింది? 

ఎదుగూరి సందింటి రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి. ఒక్క కుటుంబం నుంచి ఇద్దరు సీఎంలను చేసిన ఆ కడప జిల్లాకు దక్కిందేంటి? ఫ్యాక్షన్‌ ముద్రా? చిన్నాన్నను సైతం చంపేసిన రక్త చరిత్రా? సీబీఐని సైతం బెదిరించే తెంపరితనమా ? తండ్రి, తనయులను సీఎంలను చేసినా సొంత పరిశ్రమలు పెట్టుకున్నారు తప్ప స్టీల్‌ప్లాంట్ ఎందుకు పెట్టించలేకపోయారు ? తండ్రిని చంపిన హంతకులు పబ్లిగ్గా తిరుగుతున్నా, సోదరుడే సీఎంగా ఉన్నా ఆ ఆడబిడ్డకు న్యాయం ఎందుకు దక్కదు ? ఎడుగూరి సందింటి జగన్మోహన్‌రెడ్డి వల్ల కడప జిల్లాకు ఏం ఒరిగింది ? ఇదీ నేటి ప్రతిధ్వని. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.