Actor Ram Charan 256 Feet Cutout Inauguration in Vijayawada : విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో నటుడు రామ్ చరణ్ భారీ కటౌట్ వెలిసింది. గేమ్ ఛేంజర్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. నిర్మాత దిల్ రాజు రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డను అందుకున్నారు. ఇవాళ సాయంత్రం రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా కటౌట్‌పై పూలు వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం, తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానుల నాయకులు హాజరయ్యారు.
ప్రీ రిలీజ్‌కు పవన్ కల్యాణ్ : ఈవెంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తే ఏపీలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తామని దిల్ రాజు తెలిపారు. గేమ్‌ఛేంజర్ సినిమా చూసి చిరంజీవి సంతోషించారని చెప్పారు.
జనవరి 1న గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. సినిమాలకు పుట్టినిల్లు విజయవాడ అని కితాబునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవిని హీరో నుంచి మెగాస్టార్‌ను చేసింది ఈ విజయవాడ ప్రజలేనన్నారు. చిరంజీవి ఓ పవన్ స్టార్, మెగా పవర్ స్టార్‌ను తన అభిమానులకిచ్చారని దిల్ రాజ్ తెలిపారు. మెగా కుటుంబంలో పలువురి హీరోలను తయారు చేసి చిరంజీవి మెగా బాస్‌గా నిలిచారన్నారు.అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ సక్సెస్ అయ్యిందన్నారు. గేమ్ ఛేంజర్‌లో మెగాను, పవర్‌ను రామ్ చరణ్‌లో చూస్తారని తెలిపారు.
దేశంలోనే అతి పెద్ద కటౌట్ : రామ్ చరణ్ భారీ కటౌట్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తుందని అభిమానులు తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుతతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో విజయాలు అందుకున్నారని అభిమానులు వివరించారు ఈ భారీ కటౌట్ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు అన్నారు. ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. గేమ్ ఛేంజర్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ : ఇక రామ్‌చరణ్ సినిమాల విషయానికొస్తే దిగ్గజ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన 'గేమ్ ఛేంజర్'తో సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇటీవల అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ సుకుమార్, ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు అలాగే నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ శంకర్ అభిమానులు గేమ్ ఛేంజర్ రూపంలో ఓ గొప్ప అనుభూతిని పొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సరైన సినిమాలు తీయకపోతే మీరు విమర్శిస్తూ తిరస్కరిస్తారు. మీరెప్పుడూ అలాగే ఉండండి. కానీ, నేను హామీ మీకు ఇస్తున్నా 'గేమ్ ఛేంజర్' మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని అని ఆయన అన్నారు.
256 ఫీట్ల రామ్‌చరణ్ భారీ కటౌట్- మెగా ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!
'ఇండియన్ 2 రిజల్ట్ అస్సలు ఊహించలేదు - గేమ్ ఛేంజర్ విషయంలో అలా జరగదు'