విపత్తులో - విపత్తు నిర్వాహణ విభాగం! - ప్రతిధ్వని ఇన్ యూట్యూబ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 10:24 PM IST
|Updated : Dec 7, 2023, 6:33 AM IST
Prathidhwani: ప్రకృతివిపత్తుల్ని ఎవరూ అడ్డుకోలేరు. కానీ ఆ పరిస్థితుల్ని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాం.. ఎంత అప్రమత్తంగా ఉన్నాం, బాధితుల్ని ఎంత వేగంగా ఆదుకున్నాం అన్నదానిపైనే... ప్రజల జీవితాలు, పాలకులు - అధికారుల సమర్థత, మానవీయత ఆధారపడి ఉంటాయి. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన మిగ్‌జాం తుపాను ఈ విషయాల్ని మరోసారి చర్చకు పెట్టింది. నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ సర్కార్ విపత్తు నిర్వహణలో అసలు ఏం చేస్తోంది? ఇంటి పక్కన కార్యక్రమానికి కూడా గాలి మోటార్లో ప్రయాణించే ముఖ్యమంత్రి జగన్‌కు.. నేలనే నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న ప్రజలు పడే ఇబ్బందులు ఎంత వరకు పడుతున్నాయి? నీట మునిగిన బతుకులు రాష్ట్రవిపత్తు నిర్వహణపై సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలెక్కడ? నష్ట తీవ్రత తగ్గించడంలో గానీ, బాధితుల్ని ఆదుకోవడంలో గానీ.. ఏ విపత్తు సమయంలోనైనా యంత్రాంగం తక్షణ స్పందన చాలా కీలంగా ఉంటుంది. అధికారుల కనీసం స్పందించడం లేదు అన్న ప్రజల ఆవేదన సాక్షిగా ప్రస్తుతం ఈ విషయంలో పరిస్థితి ఎలా ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.