కరకు ఖాకీల వైఖరితో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య- ఆంధ్రనాట దళితుల దుస్థితి - ప్రతిధ్వనివార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-12-2023/640-480-20269120-thumbnail-16x9-prathidhwani.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 10:40 PM IST
Prathidhwani: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అరాచకాల తోడు, పోలీసుల వేధింపులు, నిర్భంధాలు, అరెస్టులు, లాకప్‌లో హింస అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా దళిత బలహీనవర్గాలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. డాక్టర్ సుధాకర్, సీతానగరం శిరోముండనం నుంచి మొదలైన ఈ దాష్టీకాల్లో ఇటీవలే నెల వ్యవధిలో ఇద్దరు దళితుల యువకుల ఆత్మహత్యలు ఎంతోమందిని కలసి వేస్తున్నాయి. ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ దుస్థితి బాధ్యులెవరు? దళితసంఘాల ఆవేదన పట్టేదెవరికి?
ఒకదాని వెంట మరొకటి జరుగుతున్న ఘటనలే బక్కజీవులపై కరకు ఖాకీల వైఖరిని ప్రజల కళ్లకు కడుతున్నాయి. ఆపదలో ఉంటే కాపాడాల్సిన పోలీసుల తీరే ఇలా ఉంటే.. వారిని రక్షించేది, వారి భద్రతకు భరోసా ఇచ్చేది ఎవరు? పోలీసు వ్యవస్థ అనేది ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. దళితుల పట్ల అమానవీయంగా వ్యవహరించే పోలీసుల విషయంలో ఎందుకని వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోంది? రాష్ట్రంలో ఎస్సీలు ఎంతశాతం ఉన్నారు? ఈ ప్రభుత్వం గురించి దళిత వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఈ నాలుగున్నరేళ్లలో వారి ఆలోచనల్లో మార్పు వచ్చిందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.