Thieves Arrest: దొంగతనాలకు పాల్పడుతున్న పలువురు అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం
🎬 Watch Now: Feature Video
Prakasam District Police Arrested Two Brothers and Interstate Robbers: దొంగతనాలతో రెచ్చిపోతున్న అన్నదమ్ములను పట్టుకోవటంతోపాటు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 50 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అన్నదమ్ములు సాలేటి వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు.. వరుస చోరీలతో బంగారం, డబ్బులు దోచుకుంటున్నారు. దీంతో వీరిపై నిఘా వేసి పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ అన్నదమ్ముల వద్ద సుమారు 20లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు రికవరీ చేసినట్లు వివరించారు.
మరో ముఠా వద్ద దాదాపు రూ.25లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకొక కేసులో టంగుటూరు వద్ద 22 కిలోల గంజాయి పట్టుకుని, కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులేమీ ఉంచవద్దని.. తాళం వేసి ఎక్కడికైనా వెళ్తే పొరుగింటి వారికి గానీ, పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు.