Power Cut in Uravakonda : పండగ వేళలో కూడా గంటల కొద్దీ కరెంట్ కట్.. చీకట్లో ప్రజల అవస్థలు - ఉరవకొండ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2023, 11:13 AM IST
Power Cut Problems in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రజలకు పండగ వేళా కూడా విద్యుత్ కోతల ఇబ్బందులు తప్పటం లేదు. ముందస్తూ సమాచారం లేకుండా ఐదు గంటలపాటు విద్యుత్ లైన్ల మార్పు పేరుతో సరఫరాను అధికారులు నిలివేశారు. దీంతో ఆదివారం పండుగ పూజ సామగ్రిని కొనడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఆదివారం మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
సోమవారం వినాయకచవితి సందర్భందా ముందు రోజు పూజ సామగ్రి, వినాయకుడి ప్రతిమలు కొనడానకి ప్రజలు చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం రద్దీ కారణంగా చీకట్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. చీకటిలో ఏమి కోనాలో తెలియక,ఏమి జరుగుతుందో అర్థం కాక ప్రజలు గంటల తరబడి వేచి చూడలేక నిరాశగా వెనుదిరిగారు. గంటల కొద్దీ చూచిన విద్యుత్ రాకపోవటం వల్ల కరెంట్ ఎప్పుడు వస్తుందోనని ప్రజలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే..కనీసం సరఫరా ఎప్పుడు వస్తుందో చెప్పే వారు కరువయ్యారు. విద్యుత్తు డీఈఈ, ఏఈఈలతో పాటు విద్యుత్తు సిబ్బంది ఫోన్లు పని చేయలేదు. దీంతో పండగపూట కరెంట్ కోతలు ఎంటి అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.