కోడి కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు - బాపట్లలో కోడి కత్తులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 1:33 PM IST
Police Seized The Chicken Knives in Bapatla District: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం లక్ష్మీపురంలో గురువారం కోడి పందేల్లో వినియోగించే 133 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం పక్కాగా అందిన సమాచారంతో వేటపాలెం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని ఓ ఇంటిపై దాడి చేసి కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చీరాలకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రానున్న సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎటువంటి కోడి పందెలు, పేకాట వంటి ఏ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని ఎస్సై తెలిపారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామంలోని తనిఖీల్లో భాగంగా ఒకరి ఇంట్లో కోడి పందెలాను నిర్వహించడానికి కోడి కత్తులను వినియోగిస్తున్నట్లు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి వాటిని తీసుకుని సీజ్ చేశాం. మండలంలో ఎలాంటి కోడి పందెలు జరపకూడదని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎటువంటి పందేలు నిర్వహించకూడదని ప్రజలకు తెలిపాం. -జి.సురేష్, వేటపాలెం ఎస్.ఐ.