Gamblers Arrest : జూదరులపై పోలీసు కొరడా.. కస్టడీలో 16 మంది పేకాటరాయుళ్లు - పేకాట శిబిరంపై దాడి
🎬 Watch Now: Feature Video
Police Rides On Poker Camp : శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం అగ్రహారం గ్రామ శివారులో జూదం ఆడుతున్న 16మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్ష అరవై వేల నగదు, 13 సెల్ ఫోన్లు, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరులు ఆంధ్ర,కర్ణాటక ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
జిల్లాలోని మడకశిర నియోజకవర్గానికి నలువైపులా కర్ణాటక సరిహద్దు ఉండడంతో, ఇరు రాష్ట్రాలకు చెందిన పేకాటరాయుళ్లు సరిహద్దుల్లో జూదాలకు పాల్పడుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు పటిష్ఠ నిఘా ఉంచి.. వారికి వచ్చిన పక్కా సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ వెంకటేశులు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ రైడ్లో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 16 మంది జూదరులను పట్టుకున్నారు. జూద స్థావరంలో లభించిన సొమ్ము, మొబైల్ ఫోన్లు, బైకులను స్వాధీనం చేసుకొని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ బాబు మీడియాకు వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీఐ హెచ్చరించారు.