Police Misbehavior with Sarpanch: నిధుల కోసం సమావేశానికి యాచకుడిగా సర్పంచ్.. దురుసుగా ప్రవర్తించిన పోలీసులు - చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 9:11 PM IST
Police Misbehavior with Sarpanch: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సర్వసభ్యసమావేశానికి హాజరైన సర్పంచ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పంచాయతీల నిధులు మళ్లింపునకు నిరసనగా.. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, 170 గొల్లపల్లి సర్పంచ్ ప్రకాశ్ నాయుడు.. బంగారుపాళ్యం సర్వసభ్య సమావేశానికి యాచకుడి వేషంలో హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాచకుడి వేషంలో సమావేశంలో భిక్షాటన చేశారు. నిరసన చేస్తున్న సర్పంచ్ ప్రకాశ్ నాయుడుని బయటకు పంపాలని పూతలపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు పోలీసులను ఆదేశించారు. దీంతో ప్రకాశ్ నాయుడుని పోలీసులు బయటకు పంపేందుకు ప్రయత్నించారు.
Gollpalli Sarpanch Prakash Naidu Attend to Meeting Dressed as a Beggar: నిరాకరించిన ప్రకాశ్ నాయుడు యాచకుడి వేషంలోనే నిరసన కొనసాగించారు. పోలీసులు బలవంతంగా అతనిని బయటకు లాక్కెళ్లారు. నిరసన చేస్తున్న సర్పంచ్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు దురుసుగా వ్యవహరించి లాక్కెళ్లడంతో ప్రకాశ్ నాయుడు పోలీస్ స్టేషన్లో అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సర్పంచ్‌ను వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు బైఠాయించారు. సర్పంచ్ పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.