అక్రమ గంజాయి రవాణాపై పోలీసుల పంజా - గంజాయి అక్రమ రవాణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 10:50 AM IST
Police have seized Huge Amount of Ganja: అల్లూరి జిల్లా జీకె వీధి మండలం సీలేరులో టీఆర్‌సీ క్యాంపు వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కోటి 50 లక్షలు విలువ చేసే 725 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీ కిశోర్ తెలిపారు. మెుత్తం అయిదుగురు నిందితుల్లో ఇద్దరు పట్టుబడ్డారని, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి చరవాణీలు స్వాధీనం చేసుకొని, వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ మెుత్తం గంజాయిని ఒడిశాలోని పసుపులంక వద్ద కొనుగోలు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అదనపు ఎస్పీ తెలిపారు.
సీలేరు టీఆర్‌సీ క్యాంపు వద్ద ఎస్ఐ రామకృష్ణ ఆద్వర్యంలో తనిఖీలు నిర్వహిచారని, ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్నఓ కారుతో పాటుగా ట్రక్కును తనిఖీ చేయగా, పెద్ద ఎత్తున ప్యాకింగ్ చేసిన గంజాయి బయటపడిందని ఎస్పీ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒడిశా ఆంధ్రా పరిసర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. ఒడిశా పోలీసుల సహాకారంతో మిగతా వ్యక్తులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.