Police Arrested Young Man Who Set Up A Flex: గ్రామంలోని రోడ్లపరిస్థితిపై ఫ్లెక్సీ కట్టిన యువకుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 8:33 PM IST

thumbnail

 Police Arrested Young Man Who Set Up A Flex:   అమరావతిలోని రోడ్ల దుస్థితిని తెలంగాణ గవర్నర్ దృష్టికి తెలియజేసేలా గోపాల్ యాదవ్ అనే  యువకుడు  ఫ్లెక్సీ వేశాడు. ఈ నేఫథ్యంలో ఆ యువకుడిని  పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. మంగళగిరి మండలం కురగల్లు లో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ గ్రామంలోని యువకుడు గోపాల్ ఫ్లెక్సీ వేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి వెళ్లే సమయంలో ఫ్లెక్సీలు కట్టెందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ వస్తేనే తమ గ్రామంలోని గొంతులను పూడుస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. తమను ప్రశ్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి స్టేషన్ తరలించారు. స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అరెస్టు చేసిన యువకుడిని వదిలిపెట్టారు.  ఈ నేఫథ్యంలో  గోపాల్ మాట్లాడుతూ...  తమ గ్రామంలోని రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేగారిని గత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నట్లు తెలిపాడు. సీఆర్డీ అధికారులు, ఆర్​అండ్​డీ అధికారులకు మెురపెట్టుకున్నట్లు వెల్లడించారు. అయినా స్పందించకపోవడంతో  మా సమస్యలను తెలిపేందుకు బ్యానర్ కట్టే ప్రయత్నం చేసినట్లు వెల్లడించాడు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.