thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 9:26 PM IST

ETV Bharat / Videos

బొలెరో యజమాని నయా ఆలోచన - ఆట కట్టించిన పోలీసులు

Gambling in Running Bolero Vehicle: బొలెరో వాహనాన్ని ఏవరైనా పశువులను తరిలించడానికి, ప్రయాణికులను గమ్య స్థానాలను చేరవేయడానికి ఉపయోగిస్తుంటారు. ఆఖరికి గంజాయి తరిలించడానికి వాడిన వాళ్లను చూసి ఉంటాం. కానీ ఈ బొలెరో యజమాని మాత్రం ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఆలోచించాడు. తన ఆలోచనను ఎవ్వరూ పసిగట్టలేరని తనను తాను భుజం తట్టుకుని ప్రోత్సహించుకున్నాడు. తన ఆలోచనకు నలుగురిని పోగు చేసి ఆదాయాన్ని "నాలుగు పువ్వులు ఆరు కాయలు"గా చేద్దామనుకున్నాడు. కానీ బొలెరో యజమాని ఊహలను పసిగట్టిన పోలీసులు అరెస్టు చేసి తన కథకు శుభం కార్టు వేశారు. అసలు అతను ఏమీ ఆలోచన చేశాడంటే 

ఎవరికీ అనుమానం రాకుండా బొలెరో వాహనానికి చుట్టూ పట్టా (టార్పాలిన్) కట్టి రన్నింగ్ వాహనం లోపల పేకాట ఆడుతున్న 16 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరులో జరిగింది. కూడేరు ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం జల్లిపల్లి టోల్ గేట్ వద్ద బొలెరో వాహనంతో పాటు 16 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. బొలెరో వాహనం, రూ.1,44,680 నగదు,16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన రమణ ఇందులో కీలకమైన వాడని, తన సొంత బొలెరో వాహనానికి టార్పాలిన్ చుట్టూ కట్టి మొబైల్ గ్యాంబ్లింగ్​కు ఉపయోగిస్తున్నాడని తెలిసి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బొలెరో రన్నింగ్​లో ఉంటూనే పేకాట ఆడిస్తున్నట్లు కచ్చితమైన సమాచారంతో కూడేరు ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది బృందంగా వెళ్లి వీరిని పట్టుకున్నారు. రన్నింగ్ వాహనంలో పేకాట ఆడుతున్న వీరిని చాకచక్యంగా అరెస్టు చేసిన కూడేరు ఎస్ఐ, సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.