వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు - వెంటనే దిగి ప్రయాణికులు - తప్పిన ప్రమాదం - Kanigiri RTC Bus Stuck in stream - KANIGIRI RTC BUS STUCK IN STREAM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-09-2024/640-480-22535290-thumbnail-16x9-kanigiri-rtc-bus-stuck-in-stream-at-battuvaripalli.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2024, 3:19 PM IST
Kanigiri RTC Bus Stuck in stream at Battuvaripalli : గత రెండు రోజులుగా కురిసిన వానలకు ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపోర్లుతున్నాయి. వరద నీటితో దారులన్నీ మూసుకుపోయాయి. పొదిలి మండలం బట్టువారిపల్లి వద్ద వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఎగువన కురిసిన భారీ వర్షానికి సోమవారం రాత్రి ఒక్కసారిగా వాగు పొంగి పొర్లింది. మార్కాపురం నుంచి పొదిలి వైపు వెళ్తున్న కనిగిరి డిపోకు చెందిన ఆర్టిసీ బస్సు ఇవాళ ఉదయం వాగులో చిక్కుకుని ఇంజిన్ ఆగిపోయింది.
వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు హుటాహుటిన వరద ప్రవాహంలో నడుచుకుంటూ బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో జేసీబీతో బస్సును బయటకు లాగారు. వాగుకు అటు ఇటు వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు దిగడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. వరద ఉద్ధృతి అంతగా లేక ప్రమాదం నుంచి బయట పడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.