మంత్రి పొలం బాట - నాగలి చేతపట్టి రైతుల కష్టం తెలుసుకున్న సంధ్యారాణి - Polam Pilustondi Programme
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2024, 10:20 PM IST
Minister Sandhya Rani Participated Polam Pilustondi Programme : పార్వతీపురం మన్యం జిల్లాలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. మెంటాడ మండలం జాక్కువ గ్రామంలోని రైతుల పొలం వద్దకు స్వయంగా వెళ్లి వారితో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగలితో పొలం దున్ని రైతుల కష్టాన్ని తెలుసుకున్నారు. అలాగే వ్యవసాయంలో టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పించేందుకు స్వయంగా డ్రోన్‌ను ఎగరేశారు. అనంతరం అదే గ్రామంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి పాల్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకొని వారి నుంచి వినతులను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. అనేక సంస్కరణలు చేపట్టి ఇది మంచి మనసున్న ప్రభుత్వం అని ప్రజల చేత మెప్పు పొందిందని వెల్లడించారు. కేవలం మూడు నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని తెలిపారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించడం ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమని కొనియాడారు. అలాగే మెంటాడ మండలంలోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 6 కోట్ల నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేశారని మంత్రి సంధ్యారాణి తెలిపారు.