thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

ETV Bharat / Videos

గుజరాత్ సీఎంతో మంత్రి బీసీ జనార్దన్ భేటీ - రహదారుల నిర్వహణపై అధ్యయనం - BC JANARDHAN REDDY GUJARAT TOUR

Minister Janardhar Reddy Gujarat Tour : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేలతో రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. రెండో రోజు గుజరాత్​లో మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర బృందం పర్యటన సాగుతోంది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, నిర్మాణంలో పీపీపీ విధానం అమలుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర హైలెవల్ కమిటీ అధ్యయనం చేస్తోంది. గుజరాత్ పర్యటనలో మంత్రితోపాటు రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఏపీఆర్డీసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మంత్రి బృందానికి పవర్​ పాయింట్ ప్రెజెంటేషన్: గుజరాత్ ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ ఛీప్ ఇంజనీర్, ఉన్నతాధికారులు రాష్ట్ర బృందంతో నిన్న సమావేశమయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి, అమలు తీరు గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గుజరాత్ రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల కి.మీ కు పైగా రహదారులు ఉన్నాయి. వీటిలో పీపీపీ విధానం ద్వారా 14 రహదారులకు సంబంధించి, 1089 కి.మీ రహదారులను అభివృద్ధి జరిగింది. దీని ద్వారా సుమారుగా నెలకు 300 కోట్ల మేర టోల్ ఫీజు ద్వారా ఆదాయం సమకూరడం జరుగుతోందని తెలిపారు. అహ్మదాబాద్ - రాజ్ కోట్ రోడ్డు మార్గాన్ని 2003లో ప్రపంచ బ్యాంక్ నిధుల సహయంతో అభివృద్ధి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.