ETV Bharat / state

విజయవాడ సమీపంలో పొంగిన పెద్దవాగు - చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, రైతులు - VIJAYAWADA PEDDAVAGU OVERFLOWED

Peddavagu Overflowed Due to Heavy Rain in Vijayawada: భారీ వర్షానికి విజయవాడలోని నున్న సమీపంలోని పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వికాస్‌ కాలేజీ సమీపంలో పెద్దవాగు పొంది రోడ్డుపై 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 100 మంది కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లిన 50 మంది రైతులు చిక్కుకుపోయారు.

vijayawada_peddvagu_overflowed
vijayawada_peddvagu_overflowed (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 9:23 PM IST

Updated : Sep 24, 2024, 9:58 PM IST

Peddavagu Overflowed Due to Heavy Rain in Vijayawada: ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నున్న సమీపంలో ఉన్న వికాస్ కాలేజీ రోడ్డులో ఒక్కసారిగా పెద్దవాగు పొంగింది. ఒక్కసారే కురిసిన భారీ వర్షానికి 10 అడుగుల మేర రోడ్డు పైకి వరద నీరు చేరింది. వాగు అనుకోకుండా ఒక్కసారిగా పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 150 మంది పైగా కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లి వచ్చే రైతులు అవతల ఒడ్డున చిక్కుకుపోయారు.

విజయవాడ సమీపంలో పొంగిన పెద్దవాగు - చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, రైతులు (ETV Bharat)

2 గంటలుగా వాగు ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. సాయం కోసం విద్యార్థులు, రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు స్థానికులు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దవాగు ఉద్ధృతిపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. సృజన స్పందించారు.

ఘటనాస్థలికి రెవెన్యూ, పోలీసు సిబ్బంది హుటాహుటిన వెళ్లి స్థానికుల సహకారంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ల ద్వారా విద్యార్థులు, రైతులను ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమంలో చప్టా పైనుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మరో 2 గంటల్లో వరద ప్రవాహం పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు - రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ - New Liquor Shops Notification

పెళ్లిచూపుల కోసం మేనత్త ఇంటికి వచ్చాడు - అసలు పని వదిలేసి - Son in Law Robbery at Aunt House

Last Updated : Sep 24, 2024, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.