ETV Bharat / entertainment

గిన్నిస్ బుక్​లో చిరంజీవి - మెగాస్టార్​ ఖాతాలో మరో రికార్డ్ - Chiranjeevi Guinness Record - CHIRANJEEVI GUINNESS RECORD

Chiranjeevi Guinness Record : మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు లభించింది.

Chiranjeevi Guinness Record
Chiranjeevi Guinness Record (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 5:28 PM IST

Chiranjeevi Guinness Record : మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్​కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. గిన్నిస్ బుక్‌ రికార్డ్స్‌ ప్రతినిధి రిచర్డ్ చిరంజీవికి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ఆదివారం ఈ ఈవెంట్ జరిగింది.

కాగా, మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్​గా చిరంజీవి ఎంపికయ్యారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూమెంట్స్​కు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. ఇక కార్యక్రమంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె సుష్మిత, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అశ్వినీ దత్, అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు.

ఇది ఊహించనిది
గిన్నిస్ రికార్డ్స్​లో చోటు ఎప్పుడూ ఊహించలేదని చిరంజీవి అన్నారు. ఇది తనకు ఎంతో గౌరవం అని అవార్డు అందుకున్న అనంతరం చిరు తెలిపారు. 'గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌ నేను ఎప్పుడూ ఊహించనిది. ఎప్పుడూ ఊహించని గౌరవం నాకు ఇవాళ దక్కింది. దీనికి కారకులైన నా దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు అభిమానులకు ధన్యవాదాలు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించిందా అనిపిస్తోంది. నటనకంటే ముందే నేను డ్యాన్స్‌కు శ్రీకారం చుట్టాను. చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు డ్యాన్స్‌ చేసి అందరిని అలరించేవాడిని' అని చిరు అన్నారు.

ఆర్డర్ వేస్తే వచ్చేస్తా!
ఈ ఈవెంట్​లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆమిర్ ఖాన్ అన్నారు. 'చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన నా సోదరుడిలాంటివారు. ఈ వేడుకకు రావాలని నన్ను పిలిచినప్పుడు, 'రిక్వెస్ట్ చేయడమెందుకు ఆర్డర్‌ వేయండి' అని అన్నాను. ఈ ఈవెంట్‌లో నేనూ భాగమవడం ఆనందంగా ఉంది. ప్రతి పాటను ఆస్వాదించి, డ్యాన్స్‌ చేస్తుంటారాయన' అని కొనియాడారు.

రికార్డుల రారాజు 'చిరు'కు మరో కిరీటం- ఏకంగా గిన్నిస్​ బుక్​లో ప్లేస్ - Chiranjeevi Guinness

చిరు నటించిన ఆ రెండ్ బ్లాక్ బస్టర్స్​కు సీక్వెల్​! : అనౌన్స్ చేసిన అశ్వినీ దత్​ - Chiranjeevi Hit Movie Sequel

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.