Pipeline Leakage in Cherlopalli: చెర్లోపల్లిలో పైప్​లైన్ లీకేజ్.. ఫౌంటెన్​ను తలపించిన దృశ్యాలు - Drinking Water Wastage in Cherlopalli

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 29, 2023, 7:09 PM IST

Sri Rami Reddy Drinking Water Scheme Pipeline Leakage Huge water Waste in Cherlopalli : అనంతపురం జిల్లా సెట్టూరు మండలం చెర్లోపల్లి సమీపంలో ఎస్​ఆర్​పీ తాగు నీటి పథకం (శ్రీరామి రెడ్డి) పైపులైనుకు గండి పడటంతో తాగు నీరు భారీగా వృధా అయ్యింది. అహోబిలం రిజర్వాయర్ నుంచి మడకశిర, హిందూపురం నియోజకవర్గాలకు నీటిని అందించే ప్రధానమైన ఎస్​ఆర్​పీ నీటి పథకంకు సంబంధించిన పైపులైనుకు కళ్యాణదుర్గం - కుందుర్పి ప్రధాన రహదారి పక్కనే చెర్లోపల్లి సమీపంలో గండి పడింది. దీంతో ఎక్కువ మోతాదులో నీరు వృధా అయ్యింది. పైపులైన్​ను తగిలించే ప్రదేశంలో పెద్ద ఎత్తున నీరు పైకి ఎగిసి పడటంతో ఫౌంటెన్లను తలిపించింది. ఈ దృశ్యాలు రోడ్డు వెంట వెళ్లే వాహనదారులను, స్థానిక ప్రజలను ఆకర్షించాయి. వారిని కొన్ని నిమిషాల పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం అధికారులు ఘటన స్థలానికి చేరుకోని నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.