PIL Filed in AP HC on New Registration Policy: ఏపీలో నూతన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో పిల్ దాఖలు.. - PIL Filed in AP HC on New Registration Policy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 8:28 PM IST

PIL Filed in AP HC on New Registration Policy ఏపీలో వైసీపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ విధానం(New Registration procedure)పై హైకోర్టులో పిల్ దాఖలైంది. నూతన విధానం రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమంటూ.. కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరామ్‌ ప్రసాద్ పిల్ వేశారు. భారతీయ సాక్షి చట్టంలో నిర్దేశించిన విధంగా సాక్షులు లేని దస్తావేజులు చెల్లనివిగా పరిగణిస్తారని పిటిషన్​లో పేర్కొన్నారు. 

జిరాక్స్ కాపీలు మాత్రమే ఇవ్వడం రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకం... అనుభవం లేని వార్డు సెక్రటరీల ద్వారా.. ఈ రిజిస్ట్రేషన్ విధానం అమలు పరచడం ద్వారా కొన్ని లక్షల మంది ఆస్తుల రిజిస్ట్రేషన్​ ( Registration of assets ) పై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ పిల్​ (Public Interest Litigation) లో పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందించకుండా కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తామంటూ చేసిన ప్రకటన రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమని పిటిషన్​లో పేర్కొన్నారు. శివరామ్ ప్రసాద్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.