గోదావరి వరద ముంపులోనే పలు గ్రామాలు, ప్రమాదకరంగా ప్రజల ప్రయాణం - people facing problems with floods

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2022, 12:39 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

Floods గోదావరి వరద గణనీయంగా తగ్గినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెం సమీపంలోని పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్​వే ఈరోజు కూడా వరద ముంపులోనే ఉంది. కనకాయలంక గ్రామ ప్రజలు ముంపులో ఉన్న కాజ్​వే పై నుంచి ప్రమాదకరంగా చాకలిపాలెం వైపు రాకపోకలు సాగిస్తున్నారు. ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ఈరోజు 2,75,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు సముద్రంలోకి విడిచి పెడుతున్న వరద నీరు సగానికి తగ్గింది. అయినా ఇక్కడ కాజ్​వే ముంపులోనే ఉంది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.