సమగ్ర భూరక్ష చట్టం హక్కుల ఉల్లంఘనే - అమలుకాకుండా చూసే బాధ్యత నాది : పవన్‌ - Janasena party news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 5:58 PM IST

Pawan Kalyan Meet Lawyers on New Land Act: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సమగ్ర భూరక్షణ చట్టం వల్ల భూ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి బార్ అసోసియేషన్ ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యారు. సమావేశంలో సమగ్ర భూరక్ష చట్టంలోని లోపాలపై ఆయన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు.

Pawan Comments: ''ఈ చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయి. నా భూమిలో నీకు హక్కేంటి అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వెళ్తుంది. విశాఖలో దోచుకున్న ఆస్తులు స్వాహా చేసేందుకే ఈ చట్టం తెచ్చారా?. ఈ చట్టం వల్ల రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చు. కోర్టు నుంచి న్యాయరక్షణ పొందవచ్చనే దాన్ని ఈ చట్టంలో తీసేశారు. సగటు మనిషికి సులువుగా చెప్పేందుకు ఈ చట్టాన్ని మరింత అధ్యయనం చేస్తా. ఈ చట్టం రాజ్యాంగానికి, ప్రజలకు వ్యతిరేకం. అందరికీ అర్థం అయ్యేలా చెప్పేందుకు నాకు కాస్త సమయం కావాలి. ఈ చట్టంపై ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తా. ఈ చట్టాన్ని అమలుకాకుండా చూసే బాధ్యత తీసుకుంటా. సమగ్ర భూరక్ష చట్టం అమలుకాకుండా చూసే బాధ్యత నాది.'' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.