Patients Suffering Due to Power Cut in Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్తు అంతరాయంతో రోగుల అవస్థలు.. - yemmmiganur news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 11:33 AM IST
Patients Suffering Due to Power Cut in Hospital : రాష్ట్రంలో విద్యుత్ కోతల ప్రభావం ఆసుపత్రులను తాకింది. నిత్యం వందలాది మంది వచ్చే ఆసుపత్రిలో రాత్రి విద్యుత్ లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విద్యుత్తు సరఫరా రెండు గంటల పాటు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రిలో రోగులు బాలింతలు నవజాత శిశువులు ఉక్కపోతతో.. దోమల బెడదతో అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయక చీకట్లోనే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందికి గురయ్యారు. టార్చ్ వెలుతురులో రోగులకు నర్సులు ఇంజక్షన్లు వేశారు. ఆసుపత్రికి రోజు నాలుగు వందల మందికి పైగా ఓపీ సేవలు పొందేందుకు వస్తుంటారు. అలాగే నెలకు రెండు వందలకు పైగా కాన్పులు జరుగుతాయి. ఈ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు చీకట్లో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆసుపత్రిలో 70 లక్షల రూపాయలు వ్యయంతో జనరేటర్ ఏర్పాటు చేసినా ఉపయోగంలేదని రోగుల సహాయకులు పేర్కొన్నారు.