Parents Agitation in School on Teacher Misbehaving With Students: "పిల్లలతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చర్యలు తీసుకోండి" - ఫిజికల్ సైన్స్ టీచర్ మిస్బీహేవింగ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 2:59 PM IST
Parents Agitation in School on Teacher Misbehaving With Students: అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులు తూర్పు గోదావరి జిల్లాలోని ఓ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. తమ పిల్లలతో ఆ ఉపాధ్యాయుడి తీరు సరిగా లేదని.. అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పెరవలి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధిస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. ఆయన బోధిస్తున్న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయురాలికి కూడా ఫిర్యాదు చేశారు. ఆమె స్పందించకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. సంబంధిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు స్పందిస్తూ.. విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారిస్తున్నామని వివరించారు. ఇటువంటి ఉపాధ్యాయులు ఉంటే తమ పిల్లలను పాఠశాలకు ఎలా పంపించాలని ఆవేదన వ్యక్తం చేశారు.