పింఛన్‌ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారీ- లబోదిబోమంటున్న వృద్ధులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 4:46 PM IST

Updated : Jan 13, 2024, 5:41 PM IST

thumbnail

Panchayat Secretary: పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు వాలంటీర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. పెన్షనర్లకు ఇవ్వాల్సిన రూ.1.50 లక్షలు ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈవిషయమై బొమ్మనహాళ్ ఎంపీడీఓ షకీలా బేగం దృష్టికి తీసుకెళ్లగా, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివన్న ఫోన్ స్విచ్ ఆఫ్​గా ఉన్నట్లు ఎంపీడీఓ తెలిపారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉద్ధేహల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా  శివన్న  విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతి నెలా సామాజిక పింన్షన్ డబ్బులు బ్యాంక్ నుంచి తెచ్చి వాలంటీర్లకు ఇచ్చేవాడు. అయితే, ఈ నెల మాత్రం బ్యాంక్ నుంచి లక్షా యాభై వేల రూపాయలను విడిపించాడు. కానీ, గ్రామంలో డబ్బులు పంపిణీ చేసే ముగ్గురు వాలంటీర్లకు ఆ డబ్బులు ఇవ్వలేదు. దీంతో డబ్బులు తమ చేతికి రాకపోవడంతో వాలంటీర్లు డబ్బులను పంచలేదు. 13వ తేదీ వచ్చినా వాలంటీర్లు డబ్బులు పంచకపోవడంతో పెన్షన్ లబ్ధిదారులు వాలంటీర్లను నిలదీశారు. వాలంటీర్లు తమకు ఇప్పటివరకూ పంచాయతీ కార్యదర్శి శివన్న డబ్బులు ఇవ్వలేదని, తమకు డబ్బులు అందనప్పుడు ఎలా ఇవ్వగలమని చెప్పారు. డబ్బులు అందలేదన్న విషయం బొమ్మనహల్ మండల ఎంపీడీఓ షకీలా బేగంకు తెలిపారు. విషయం తెలుసుకున్న షకీలా బేగం కార్యదర్శికి ఫోన్ చేశారు. కానీ, శివన్న ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఇదే విషయమై శివన్న కుటుంబాన్ని సంప్రదించగా, శివన్న ఎక్కడ ఉన్నాడో తమకు కూడా తెలియదని చెప్పడం గమనార్హం.

Last Updated : Jan 13, 2024, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.