Pamarru MLA Kaile Anil Kumar Fire on Public: ఇళ్ల స్థలాలు అడిగిన ప్రజలు.. వేలెత్తి చూపుతూ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే - ap political news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 1:05 PM IST

Pamarru MLA Kaile Anil Kumar Fire on Public :  యువకులు ఇళ్ల స్థలాల గురించి అడిగినందుకు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ స్థానికులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యాకమూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని (Jagananna Arogya Suraksha Programme) నిర్యహించారు. 

వైద్య శిబిరం పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్​ను స్థానిక ప్రజలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. దాంతో అసహనానికి లోనైన ఎమ్మెల్యే.. గతంలో ఇచ్చాం కదా అని బదులు ఇచ్చారు. అక్కడే ఉన్న యువకుడు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీయడంతో వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపోద్రికుడైన కైలే అనిల్ కుమార్​ ఆవేశ పెడితే పనులు అవ్వవని ఇచ్చే వరకు ఓపిక పట్టాలని ఉచిత సలహా ఇచ్చారు. త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తే ఇల్లు కట్టుకుంటామని అడిగితే.. ఇంతలా ఆవేశపడాలా అంటూ స్థానిక ప్రజలు వాపోయారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.