సంక్రాంతి సంబరాల్లో గానా, భజానా - వేదికపై స్టెప్పులేసిన జిల్లా కలెక్టర్ - సంక్రాంతి సంబరాల్లో కలెక్టర్ డాన్స్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 1:04 PM IST
Palnadu Collector Siva Shankar Dance in Sankranti Celebrations : రాష్ట్రంలో ఊరూవాడా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రతి గ్రామంలో పండగ సందడి అంబరాన్నింటింది. పలు ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు, పంతంగుల ఎగరవేత యువత అధికంగా పాల్గొని సందడి చేశారు. పిండివంటకాలతో మకర సంక్రాంతిని ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వృత్తిరీత్యా, విద్య కోసం ఎక్కడికి వెళ్లినా పండగ జరుపుకోవడానికి సొంతూళ్లకు చేరుకుని ఘనంగా నిర్వహించుకున్నారు. ఉన్నతాధికారులు సైతం ప్రజలతో మమకమై పండగను జరుపుకొన్నారు. కలెక్టర్ డాన్స్ వేసి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు.
Sankranti Celebrations 2024 in AP : పల్నాడు జిల్లా నరసరావుపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి రోడ్డు కోడెల స్టేడియంలో పండుగ వేడుకలు ఘనంగా కొనసాగాయి. కలెక్టర్ శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ల దంపతులు జ్యోతి వెలిగించి సంబరాలు ప్రారంభించారు. వేడుకలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన లేజర్ షో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లేజర్ షోలో పల్నాడు జిల్లా ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఆట, పాటలకు స్టేజీపై కలెక్టర్ వేసిన స్టేప్పులు ప్రజలను అలరించాయి. చీకట్లలో ప్రజలు తమ సెల్ ఫోన్ వెలుగులతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.