Palle Raghunatha Reddy Fires on Sakshi Paper: క్షమాపణలు చెప్పాలి.. లేకుంటే న్యాయపరమైన చర్యలు: పల్లె రఘునాథరెడ్డి - ఏపీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 6:12 PM IST

Updated : Aug 22, 2023, 6:17 PM IST

Palle Raghunatha Reddy Fires on Sakshi Paper: భూమిని మ్యూటేషన్‌ చేసుకునేందుకు చలానాలు చెల్లించడాన్ని.. లంచం ఇవ్వడంగా చిత్రీకరించి.. సాక్షి దినపత్రిక తనపై అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. సాక్షి పత్రిక చేసిన ఈ పనిని ఆయన ఖండించారు. సాక్షికి ఏ మాత్రం పత్రిక విలువలు లేవని అన్నారు.  పల్లె రఘునాథరెడ్డి తన భార్య మరణానంతరం ఆమె పేరు మీద ఉన్న భూమిని మార్చుకునేందుకు అనంతపురం జిల్లా కదిరి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి మ్యూటేషన్​ కోసం చలానా చెల్లించాలని చెప్పినట్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. దీంతో చలానా చెల్లించటానికి తాను బహిరంగంగా ఇచ్చిన డబ్బును.. సాక్షి దినపత్రిక లంచంగా చూపించిందని రఘునాథరెడ్డి తెలిపారు. ఈ విధంగా అసత్య ప్రచారాలు చేసిన సాక్షి పత్రిక తనకు క్షమాపణలు చెప్పలని.. లేదంటే ఈ అంశంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Last Updated : Aug 22, 2023, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.