'సీఎం జగన్ ఏం మొహం పెట్టుకొని కడప పర్యటనకు వస్తున్నారు!' - వైసీపీ వర్సెస్ టీడీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 5:01 PM IST

Opposition concern over CM Jagan Kadapa district visit: కడపలో సీఎం జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు వెళ్తున్న విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరిత హోటల్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన విపక్ష పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షనేతలు మాట్లాడారు. అభివృద్ధి పేరిట కడప నగరాన్ని చిన్నభిన్నం చేసిన సీఎం జగన్ ఏం మొహం పెట్టుకొని, మళ్లీ కడప పర్యటనకు వస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, విపక్ష నేతల మధ్య తోపులాట జరిగింది. వారందరీని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో, అంగన్వాడీలు ఆందోళన చేపడతారన్న సమాచారంతో వారి వద్దకు కడప డీఎస్పీ షరీఫ్ వెళ్లారు. 

అంగన్వాడీల పస్తులు: అంగవన్వాడీల సమస్యలు సీఎంతో చెప్పడానికి ఇద్దరిని అనుమతిస్తామని డీఎస్పీ షరిఫ్‌ తెలిపారు. కానీ వారు పది మంది వస్తామని చేప్పడంతో పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో అంగన్వాడీలను ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు తీసుకువచ్చిన భోజన ప్యాకెట్లను కూడా అంగన్వాడీలు తమకు వద్దంటూ, తమ ఆకలి బతుకులు సీఎంకి తెలియాలంటూ అన్నం ప్యాకెట్లను వెనక్కి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.