Old Woman Died Due to Electric Shock: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. వృద్ధురాలు మృతి - Accident news
🎬 Watch Now: Feature Video
Old Woman Died Due to Electric Shock: కర్నూలు జిల్లా అదోనిలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి చెందింది. లంగర్ బావి వీధిలో ఇంటి ముందు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అవి అయ్యమ్మ అనే వృద్దురాలికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయ్యమ్మ కాయగూరలు కొనడానికి బయటకు వచ్చింది. అదే సమయంలో కరెంటు తీగ అయ్యమ్మ మీద పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఆ వీధిలో కరెంటు వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని.. అవి తెగి కింద పడుతున్నాయని చాలా సార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదని స్థానికులు తెలిపారు. అప్పుడప్పుడు లైన్మెన్ వచ్చి వాటికి అరకొరగా మరమ్మతులు చేసి వెళ్తున్నారే కానీ పూర్తిగా చేయట్లేదు. రోడ్లు మీద పిల్లలు తిరుగుతుంటారు.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇలా ఎన్ని ప్రాణాలు పోతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందిస్తారని స్థానికులు వాపోతున్నారు. వృద్దురాలి మృతితో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.