Samalochana Sabha: 'ఎన్టీఆర్ గురించి తెలియాలనే మూడు గ్రంథాలను అందుబాటులోకి తెచ్చాం' - టీడీ జనార్ధన్ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2023, 11:59 AM IST

NTR Samalochana Sabha: తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని.. ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్ సైట్, సావనీర్ కమిటీ అధ్యక్షుడు టీ.డీ జనార్ధన్ కొనియాడారు. అంతటి మహానుభావుడి గురించి ఈ తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మూడు గ్రంథాలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. ఎన్టీఆర్‌ చారిత్రక, శాసన సభ ప్రసంగాలు, శక పురుషుడు గ్రంథాలపై గుంటూరులోని సూర్య దేవర కళ్యాణ మండపంలో ఆదివారం సమాలోచన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినీ పాత్రికేయులు, రచయితలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఔనత్యాన్ని, అందించిన సంక్షేమాన్ని, రాజకీయ జీవిత పరిచయాన్ని, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని.. నేతలు సభలో గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను , భావజాలాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.