NRIs Protests in Kuwait Against Chandrababu Arrest చంద్రబాబు అరెస్టుపై కువైట్​లో భారీగా నిరసనలు.. "బాబుతో మేము సైతం" అంటూ నినాదాలు - Babu Arrest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 4:02 PM IST

NRIs Protests in Kuwait Against Chandrababu Arrest : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుుడుకు మద్దతుగా విదేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమంటూ  ప్రవాసాంధ్రులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా "బాబుతో మేము సైతం" అంటూ ఎన్ఆర్ఐ  తెలుగువారు కువైట్‌లో నిరసనకు దిగారు. వీరి నిరసనకు టీడీపీ-జనసేన నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. "సైకో పోవాలి... బాబు రావాలి" అంటూ నినాదాలతో హోరెత్తించారు. విజనరీ నేత చంద్రబాబును అరెస్టు చేయడం అంటే అభివృద్ధిని జైల్లో పెట్టడమని కువైట్​లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

CBN Arrest Updates : ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని  వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ యాత్రలకు వస్తున్న ఆదరణ చూసి జగక్​కు వెన్నులో వణుకు పుట్టి.. నీచ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారని వారు అన్నారు. తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ నాయకులు కలిసి జగన్‌ను ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.