NRIs Agitation in America on CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ప్రవాసాంధ్రుల నిరసనలు.. - ప్రవాసాంధ్రుల నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 11:28 AM IST

NRIs Agitation in America on CBN Arrest:  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రవాసాంధ్రులు వివిధ దేశాల్లోని పలుచోట్ల నిరసనలు తెలియజేశారు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్ ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్స్​లో జరిగిన నిరసనలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు. ఎన్నారైలు ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్స్ నుంచి భారత ఎంబాసి వరకు ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియచేశారు. ఏపీలో అప్రజాస్వామిక, కక్షపూరిత పరిపాలన వల్ల అభివృద్ధి తిరోగమనంలో వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో పాలనపై విరుచుకుపడ్డారు.

అమెరికా డెట్రాయిట్‌ మిచిగాన్‌లో ఎన్‌ఆర్‌ఐలు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిరసన చేపట్టారు. నెదర్లాండ్స్​లోని హేగ్ నగరంలో భారతీయ రాయబార కార్యాలయం నుంచి అంతర్జాతీయ న్యాయస్థానం వరకు తెలుగుదేశం అభిమానులు జోరు వర్షంలోను ర్యాలీ నిర్వహించారు. ఏపీ పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యహరించాలని శాంతి భవనంగా పిలిచే అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గర "అక్రమ ఆరెస్టు ఆపాలి" "మేము సైతం బాబు కోసం" "సైకో పోవాలి సైకిల్ రావాలి" అంటూ నినాదాలు చేశారు. ఏపీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు జైల్లో ఉండడం తమకు ఎంతో ఆవేదన కలిగిస్తుందన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.