ఏళ్లు గడిచినా డోలీమోత కష్టాలు తప్పడం లేదని గిరిజనుల ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 3:23 PM IST

thumbnail

No Road Facility in Araku : దేశం అభివృద్ధిపథంలో సాగుతున్నా.. అక్కడ జనాలు కనీస రవాణా సౌకర్యానికి నోచుకోలేదు. ఏడు పదుల స్వాతంత్య్రంలో కూడా ఆ గ్రామంలో అంబులెన్స్​ కూత వినబడదు. అరకులోయ మండలం జరిమానుగూడ గ్రామంలో జబ్బు అయినా, బిడ్డకు జన్మనివ్వడమైనా డోలీమోతే అంబులెన్సు.. తల్లి అరుపులే అంబులెన్స్​ సైరన్.​ 

Villagers Took Pregnant Woman to HospitaL Dolly : ఏళ్లు గడిచినా డోలీమోత కష్టాలు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలం జరిమానుగూడ గ్రామంలోని  స్వాతికి పురిటినొప్పులు రావడంతో వారి కుటుంబసభ్యులు సుమారు ఏడు కిలోమీటర్లు మేర డోలిమోత మోసుకుంటూ గన్నెల ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. రహదారి లేక 108 వాహనం గ్రామానికి రావడం లేదని అందుకే తమకు డోలిమోతలు తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎవరికి ఆనారోగ్యం చేసినా డోలిలో ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని అంటున్నారు. రోడ్డు లేదని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. రహదారి నిర్మిస్తే తమ కష్టాలు తీరుతాయని ఆదివాసిలు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.