Nirudyogi Kirana&General Stores: 'ప్రభుత్వం మీదొట్టు.. ఇది నిరుద్యోగి కొట్టు..!' యువకుడి వినూత్న నిరసన

By

Published : Jul 13, 2023, 4:01 PM IST

thumbnail

Nirudyogi Kirana&General Stores: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని వంగర గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసి విసిగిపోయాడు. చివరికి స్వయం ఉపాధి మేలనుకున్న ఆ యువకుడు.. 'నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్' పేరుతో ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసి వినూత్న రీతిలో ప్రభుత్వానికి తన ఆవేదనను తెలియజేశాడు. ఇంజినీరింగ్​తో పాటు, పలు డిగ్రీలు సాధించిన దత్తి వెంకటరమణ.. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూశాడు. ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేయకపోవటంతో నిరాశ, నిస్పృహలకు గురయ్యాడు. ఇక చేసేదేంలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు తన ఇంటివద్ద 'నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్' పేరుతో ఓ దుకాణాన్ని ప్రారంభించాడు. ఉపాధి దొరకని పరిస్థితుల్లో నిరుద్యోగుల అవస్థను ప్రభుత్వానికి తెలియజేసేందుకే దుకాణానికి ఆ పేరు పెట్టినట్లు యువకుడు తెలిపాడు. 

"నేను ఐటీఐ, బీటెక్​తో పాటు డిగ్రీ కూడా పూర్తి చేశాను. రైల్వేలో అప్రెంటీస్​గా కూడా పని చేశాను. క్యాంపస్ సెలక్షన్​లో రూ.10వేల నుంచి రూ.12వేల వరకు మాత్రమే వేతనం ఇస్తామన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆ జీతం సరిపోదు. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసి.. ఇక చేసేదేంలేక ఏడాది కిందట ఈ దుకాణాన్ని ప్రారంభించాను. నా బాధ ప్రభుత్వానికి అర్థంకావాలనే ఉద్దేశంతోనే దుకాణానికి 'నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్' అని పేరు పెట్టాను." - దత్తి వెంకటరమణ, షాప్ నిర్వాహకుడు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.