రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చర్యలు తీసుకోవాలి: నిమ్మగడ్డ రమేశ్ - నిమ్మగడ్డ ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 9:25 PM IST
Nimmagadda Ramesh Meet Governor: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు సిటిజన్ ఫర్ డెమోక్రసీ కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు, ఉద్యోగులను వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిపాలన చేయాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆశిస్తుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి రెండు ఓట్లు కలిగి ఉండటం అనైతికమని పేర్కొన్నారు. ఒకరికి ఒకే ఓటు ఉండేలా ఎన్నికల సంఘం ప్రధాన రాజకీయ పార్టీలతో చర్చించి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
Vote Issue in AP: ఓటు తొలగించేటప్పుడు సంబంధిత వ్యక్తికి నోటిసు ఇచ్చి వివరణ తీసుకోవాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన వ్యక్తి గ్రామంలో నివాసం లేనంత మాత్రనా, ఓటర్ జాబితాలో పేరును తొలగించకూడదని తెలిపారు. కేవలం బీఎల్వోల ఫిర్యాదు మేరకు ఓటు హక్కును తొలగిస్తున్నారని ఆరోపించారు. తాను చేసిన ఫిర్యాదులకు గవర్నర్ సానుకూలంగా స్పందిచారని నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు.