సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా - vijayawada news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 3:52 PM IST
National Employment Guarantee Scheme Field Assistants Dharna : తమ సమస్యలను పరిష్కరించాలంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తాడేపల్లిలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు వచ్చిన క్షేత్ర సహాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Field Assistant Demands : గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల స్థాయి బదిలీ సౌకర్యం, ప్రమోషన్ కల్పించాలని కోరుకున్నారు. మ్యాన్డేస్ విధానం రద్ధు, ఎఫ్టీఈని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేయాలని పేర్కొన్నారు.