రసాభాసగా నరసాపురం మున్సిపల్ సమావేశం - 'అవినీతి నిరూపిస్తే ఆత్మహత్యకు సిద్దం' - ap news today

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 7:23 PM IST

Narasapuram Muncipal Council Budget Meet: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వ్యక్తిగత ఆరోపణలతో రసాభాసాగా మారింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ అధ్యక్షతన ప్రారంభం కాగా, ఆరోపణలతో మొదలై సవాళ్లు చేసుకునే వరకు వెళ్లింది. కౌన్సిల్​ బడ్జెట్ మొత్తంలో అంకెల గారెడీ తప్ప, కొత్త విషయాలు గానీ, పట్టణాభివృద్ధికి బడ్జెట్​ కేటాయించలేదని మాజీ ఛైర్‌పర్శన్ భర్త కోటిపల్లి సురేశ్​ విమర్శించారు. దీంతో అధికార కౌన్సిలర్లు గంగరాజు, మాజీ ఛైర్‌పర్శన్ భర్త చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

మాజీ ఛైర్‌పర్సన్ కోటిపల్లి పద్మ నరసాపురం మున్సిపాలిటీ చరిత్రలోనే అధిక లబ్ది పొందారని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనికి సురేశ్​ స్పందిస్తూ తన భార్య అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగినట్లు నిరూపిస్తే, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్​ విసిరారు. కౌన్సిల్‌ సమావేశం పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. ఈ క్రమంలో కౌన్సిల్​ సమావేశంలో వ్యక్తిగత ఆరోపణలు విడిచిపెట్టాలని ఛైర్‌పర్సన్‌, సభ్యులు ఇరువురికి సర్దిచెప్పగా వివాదం సద్దుమణిగింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.