తాడేపల్లి ప్యాలెస్ గేట్లు పగలగొట్టే వరకు యువగళం కొనసాగిస్తా: లోకేశ్ - నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 9:09 PM IST
Nara Lokesh Yuvagalam Padayatra: కాకినాడలో లోకేశ్ యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాధరణ చూసి తట్టుకోలేకే జగన్ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని లోకేశ్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపడం ఖాయమని తేల్చిచెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడను వాటాలు వేసుకుని పంచుకుని అవినీతికి పాల్పడుతున్నారని లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. కన్నబాబు కంపెనీలు, స్థిరాస్తి వ్యాపారుల నుంచి డబ్బు దండుకున్నారని ఆరోపించారు.
వారాహి యాత్ర, యువగళం యాత్ర చూసి జగన్‌కు భయం పట్టుకుందని లోకేశ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజలను నమ్ముకుంటే జగన్ దొంగఓట్లను నమ్ముకున్నారని అన్నారు. తాడేపల్లి ప్యాలస్ గేట్లు పగలగొట్టే వరకు యువగళం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో గ్రూప్ ఉద్యోగాలు భర్తీ చేయరని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో కాకినాడను అభివృద్ధి చేశామని తెలిపారు.