యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి - తరలివస్తోన్న అశేష జనం - విజయనగరం జిల్లాలో యువగళం సక్సెస్ మీట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 12:46 PM IST
Nara Lokesh Yuvagalam Concluding Meeting Arrangements: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ జైత్రయాత్ర సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరగనున్న ఈ సభకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టీడీపీ, జనసేన శ్రేణులు హాజరుకానున్నారు.
విజయోత్సవ సభలో 6 లక్షలు మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు 7 రైళ్లు బయలు దేరనున్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, ఇతర వాహనాల్లో అశేష జనవాహిని ఈ సభకు హాజరుకానున్నారు. ఈ విజయోత్సవ సభ ద్వారా టీడీపీ 2024 ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనుంది. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకొనున్న ఈ సభ నిర్వహణ ఏర్పట్లుపై మా ప్రతినిధి ఓబులేసు మరిన్ని వివరాలు అందించారు.