Nara Lokesh Video on Chandrababu Tour: 'బాబు రావాలి.. రాష్ట్రం గెలవాలి'.. చంద్రబాబు ప్రాజెక్టు పర్యటనలపై లోకేశ్ వీడియో - నారా లోకేశ్ ట్వీట్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-08-2023/640-480-19238523-677-19238523-1691735693992.jpg)
Nara Lokesh Video on Chandrababu Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తేనే.. ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు నిర్వహించిన 'సాగునీటి ప్రాజెక్ట్‌ల విధ్వంసం పై యుద్దభేరి' విజయవంతం అయ్యిందంటూ చంద్రయాన్ పేరుతో ఆయన ట్వీట్ చేశారు. 10 రోజుల్లో 3 వేల కిలోమీటర్ల మేర చంద్రబాబు పర్యటనలు చేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు. 10 రోజులు.. 15 ప్రాజెక్టులు.. 20 జిల్లాలు.. 30 నియోజకవర్గాలు.. 35 ప్రజెంటేషన్లు, రోడ్ షోలు, బహిరంగ సభలు.. దాదాపు 3000 కిలోమీటర్ల మేర యాత్ర సాగిందన్నారు. బెదిరింపులకు భయపడకుండా.. రాళ్ల దాడులను లెక్కచేయకుండా.. 'జలం కోసం..జనం కోసం'.. పర్యటన చేశారని కొనియాడారు. సాగునీటి కోసం.. రైతు బాగు కోసం.. నీళ్ల కోసం ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబే ప్రజా నాయకుడని పేర్కొన్నారు. 'బాబు రావాలి.. రాష్ట్రం గెలవాలి' అంటూ చంద్రయాన్ పేరుతో వీడియో విడుదల చేశారు.