Nara Lokesh Public Meeting at Gannavaram: 'గన్నవరం టీడీపీ కంచుకోట.. వచ్చే ఎన్నికల్లో 25వేల మెజారిటీతో గెలుస్తాం' - గన్నవరం టీడీపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2023, 7:11 PM IST
Nara Lokesh Public Meeting at Gannavaram : గన్నవరంలో టీడీపీ యువగళం పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం శ్రేణులు భారీగా తరలి వచ్చారు. గన్నవరం బహిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ.. భారీగా ఏర్పాట్లు చేసింది. గన్నవరంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, మారిన సమీకరణాలతో టీడీపీ బలనిరూపణకు సిద్ధమైంది. 2009 నుంచి గన్నవరంలో వరుస విజయాలతో తెలుగుదేశం హ్యాట్రిక్ సాధించింది. చరిత్రను కొనసాగించేలా లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా లోకేశ్ యువతను ఉద్దేశించి ప్రసగించనున్నారు. యువతను సరైన మార్గంలో పెట్టడం, ఉద్యోగ కల్పన, ఆత్మవిశ్వాసం మీద యువత నిలబడేలా విధంగా యువతకు సూచనలు ఇవ్వనున్నారు. ఇటీవల గన్నవరంలో తెదేపా కార్యలయంపై దాడి తెదేపా వారిపైనే కేసులు వంటి ఘటనలతో శ్రేణులు సభకు కసిగా తరలివస్తున్నారు. శ్రేణుల్లో ధైర్యం నింపి, గన్నవరం గడ్డపై తెలుగుదేశం విజయం కొనసాగేలా లోకేశ్ ఎన్నికల సంసిద్ధత సందేశం ఇవ్వనున్నారు. గన్నవరం సభ ఏర్పాట్లపై నేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి..