Nara Lokesh Public Meeting at Gannavaram: గన్నవరంలో బహిరంగ సభ.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ.. విస్తృత ఏర్పాట్లు - నారా లోకేశ్ గన్నవరం
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Public Meeting at Gannavaram: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా.. ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో నిర్వహించే భారీ బహిరంగ సభను తెలుగుదేశం నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు భారీగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్న నాయకులు.. అందుకు తగ్గట్లుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలోకి చేరడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. గన్నవరం నుంచి 2019లో పోటీ చేసి గెలుపొందిన వల్లభనేని వంశీ తర్వాత తెలుగుదేశానికి ఝలక్ ఇచ్చి జగన్ పంచన చేరారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడంతో.. గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ్టి సభ ద్వారా బలనిరూపణకు తెలుగుదేశం సిద్ధమైంది. గన్నవరంలో 9 ఎకరాల్లో బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సభ వేదిక నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా పార్టీ ముఖ్య నేతలు ప్రసంగించనున్నారు.