Lokesh Padayatra: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. వర్షమైనా తగ్గేదేలే
🎬 Watch Now: Feature Video
Lokesh Padayatra: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఎండా, వాన అంటూ లెక్కచేయకుండా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. నిత్యం సామాన్యులకు దగ్గరగా ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం నుంచి సాయంత్రం పాదయాత్ర ప్రారంభం అయింది. కొద్ది సేపటికే భారీ వర్షం కురిసింది. జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగించారు. టీడీపీ నేతలు గొడుగును తీసుకువచ్చే ప్రయత్నం చేయగా.. గొడుగును వద్దన్నారు. కొద్ది సేపు ఆగాలని నాయకులు సూచించినా వినకుండా లోకేశ్ ముందుకు కదిలారు. లోకేశ్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, రైతలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్షంలో సైతం ప్రతి ఒక్కరినీ పలకరించుకుంటూ లోకేశ్ ముందుకు సాగారు. స్థానికంగా ఉండే చిరువ్యాపారులను పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటికి వర్షం తగ్గుముఖం పట్టటంతో పాదయాత్ర ప్రశాంతంగా ముగిసింది.