ETV Bharat / state

విశాఖలో గ్రోత్‌ హబ్‌- ప్రణాళికలు సిద్దం చేస్తోన్న నీతి ఆయోగ్‌ - NITI AAYOG GROWTH HUB

'వికసిత్‌ భారత్‌' లక్ష్యంగా 'నీతి ఆయోగ్‌' ఆర్థిక ప్రణాళికలు - ముంబయి, సూరత్, వారణాసి సరసన మన విశాఖ

NITI Aayog Growth Hub Project in Visakhapatnam
NITI Aayog Growth Hub Project in Visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2024, 11:18 AM IST

Updated : Nov 24, 2024, 11:47 AM IST

NITI Aayog Growth Hub Project in Visakhapatnam : 'వికసిత్‌ భారత్‌ (Viksit Bharat 2047)' లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకొని 'నీతి ఆయోగ్‌ (NITI Aayog)' ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తి అయింది. దేశంలో మొత్తం 20 నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా 4 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖకీ చోటు కల్పించారు. ముంబయి, సూరత్, వారణాసి మిగిలిన మూడు. వాటి అభివద్ధికి ప్రణాళికల ముసాయిదాలు ఇప్పటికే సిద్ధం కాగా విశాఖపట్నం నగరానిది తయారవుతోంది. ఏ అంశాల ఆధారంగా నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించొచ్చు, అందుకు ఉన్న అవకాశాల వంటివి పరిశీలిస్తున్నారు.

11 రకాల అభివృద్ధి సూచికలు : ఆయా ప్రాంతాల్లోని వనరుల ఆధారంగా ఆర్థిక ప్రణాళికకు ఇప్పటికే 11 రకాల అభివృద్ధి సూచికలను గుర్తించారు. వాటి ఆధారంగా కసరత్తు చేసి ఆర్థిక ప్రగతికి బాటలు వేయనున్నారు. ఇందుకోసం విశాఖపట్నంలో నీతి ఆయోగ్‌ 2 దఫాలు పలు జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులు, అనుబంధ రంగాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. ఏయే అంశాలపై దృష్టి సారించాలి, ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో అధికారులకు మార్గనిర్దేశం చేసింది.

విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్- విధ్వంసం నుంచి వెలుగుల దిశగా కసరత్తు! - AP Govt on Visakha Development

విశాఖపట్నం హబ్‌ పరిధిలోకి వచ్చే జిల్లాలు : విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ.

దిల్లీ, ముంబయి నగరాల స్థూల జాతీయోత్పత్తి (GDP) కొన్ని దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. దేశంలోని మిగిలిన ప్రాంతాల జీడీపీని ఆ స్థాయికి తీసుకువచ్చేలా ఆర్థిక ప్రణాళికలను నీతి ఆయోగ్‌ చేస్తుంది.

ఆ నాలుగు నగరాలు

ముంబయి : ముంబయి మెట్రో రీజియన్‌ గ్రోత్‌ హబ్‌ (Mumbai Metro Region Growth Hub)కు ఆర్థిక ప్రణాళిక పూర్తి అయింది. ఇటీవల నీతి ఆయోగ్‌ దాన్ని ఆవిష్కరించింది. త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధం అమవుతున్నారు.

వారణాసి - ప్రయాగ్‌రాజ్‌ : దీనికి సంబంధించి ఆర్థిక ప్రణాళిక పూర్తి అయింది. చివరిగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆ తర్వాత దీన్ని అమలు చేస్తారు.

సూరత్ : దీని ఆర్థిక ప్రణాళిక ముసాయిదా పూర్తి అయింది. ఆవిష్కరించారు.

విశాఖపట్నం : ఈ నగరానికి సంబంధించి నీతి ఆయోగ్‌ ప్రాథమిక పరిశీలన పూర్తి అయింది. మరోసారి సమీక్షించి, నివేదిక రూపకల్పన చేయనుంది.

దృష్టి సారించే రంగాలు : పెట్రో రసాయన, రసాయన విభాగం, విద్య, ఫార్మా, ఐటీ , టెక్స్‌టైల్‌, పర్యాటకం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మత్స్య సంబంధ పరిశ్రమలు, ఇంజినీరింగ్‌ గూడ్స్‌, లాజిస్టిక్స్, పోర్టు సంబంధిత కార్యకలాపాలు, రియల్‌ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం

గాల్లో తేలియాడుతూ భూమిపై అందాలను చూసేయ్​ - విశాఖలో ‘స్కై సైక్లింగ్‌’

Last Updated : Nov 24, 2024, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.