Lokesh fire on CM Jagan: టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ శ్రేణుల్లో వణుకు: నారా లోకేశ్ - నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 113వ రోజు
🎬 Watch Now: Feature Video
Lokesh fire on CM Jagan : తెలుగుదేశం మేనిఫెస్టోతో వైఎస్సార్సీపీ నాయకుల్లో వణుకు మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్న ప్రభుత్వ పెద్దలకు.. జగన్‌లా అప్పులు చేయరని.. సంపదను సృష్టించ గల సామర్థ్యం చంద్రబాబుకు ఉందని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పేదలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 113వ రోజు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఎన్నికల హామీలన్నీ విస్మరించాడని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్ ఇస్తానన్న హామీ ఏమైంది అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్.. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడని దుయ్యబట్టారు. బస్ చార్జీలు ఇప్పటికే మూడు సార్లు పెంచి పేదలపై భారం మోపారని.. కానీ, మహిళలకు టికెట్ అవసరం లేదన్న వ్యక్తి మన చంద్రన్న అని తెలిపారు.